
అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలి
అనంతపురం అర్బన్: ‘లక్ష్యాలను గడువులోపు పూర్తి చేయాలి. సంక్షేమ పథకాల ద్వారా అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలి’ అని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఎస్‌హెచ్‌జీలను ప్రోత్సహించే దిశగా శిల్పారామంలోని స్టాళ్లలో యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని అంబేడ్కర్ భవన్ పక్కనున్న స్థల సమస్యకు సంబంధించి వాస్తవ నివేదిక సమర్పించాలన్నారు. భూ పంపిణీ కోసం 35 మంది మాజీ సైనికులు జిల్లా సైనిక సంక్షేమ శాఖ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన దుకాణ సముదాయాల నుంచి బాడుగలు తప్పకుండా వసూలు చేయాలన్నారు. స్కాలర్‌షిప్‌లు, ఖాజీల రెన్యువల్, ఇమామ్, మౌజన్లు, పాస్టర్ల వేతనం తదితర అంశాలపై వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
హిజ్రాల ఆగడాలపై ఫిర్యాదులు
హిజ్రాల ఆగడాలపై ఇటీవల తనకు ఫిర్యాదులు అందాయని కలెక్టర్ చెప్పారు. వాటిని అరికట్టేందుకు జిల్లా ఎస్పీకి విభిన్న ప్రతిభావంతుల శాఖ ద్వారా లేఖ సమర్పించాలని ఆదేశించారు.సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.
పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్
ఉరవకొండ: మండల పరిధిలోని వెలిగొండ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు గోవిందరాజులు, సిద్దప్ప, బొజ్జన్న, వీణమ్మలు గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ ఐజయ్యతో మాట్లాడారు. సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలోని ఉమాదేవి రేషన్ షాపును కలెక్టర్ తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నరసింహులు, సర్పంచ్ వీరాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ వినోద్‌కుమార్