
అరటి మొక్కల నరికి వేత
తాడిపత్రి టౌన్ (పెద్దవడుగూరు): పెద్దవడుగూరు మండలంలోని క్రిష్టిపాడు గ్రామంలో కౌలు రైతు విజయ్‌కుమార్ సాగు చేసిన తోటలోని అరటి మొక్కలను దుండగులు నరికి వేశారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో తోటలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు 450 మొక్కలు నరికి వేసినట్లు బాధిత కౌలు రైతు విజయ్‌కుమార్ తెలిపారు. సమాచారం అందుకున్న సీఐ రామసుబ్బయ్య క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు.
బతికుండగానే చంపేశారు!
కుందుర్పి: మండల కేంద్రానికి చెందిన సరోజమ్మ బతికి ఉండగానే చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదైంది. 64 ఏళ్ల వయసున్న ఆమెకు ప్రతి నెలా వింతతు పింఛన్ అందుతోంది. ఈ నెల 1న పింఛన్ తీసుకునేందుకు వెళ్లగా... ఆమె మృతి చెందినట్లుగా రికార్డుల్లో ఉందని, పింఛన్ మొత్తాన్ని ఇవ్వడం కుదరదంటూ అధికారులు తెలపడంతో ఆమె అవాకై ్కంది. మూడేళ్ల క్రితమే తన భర్త చనిపోగా, అప్పటి నుంచి తనకు వితంతు పింఛన్ అందుతోందని, తాను చనిపోయినట్లుగా ఎవరు చెప్పారో తెలపాలని ఎంపీడీఓ లక్ష్మీశంకర్, ఇతర అధికారులను వృద్ధురాలు నిలదీసింది. దీంతో స్వీయరక్షణలో పడిన అధికారులు... ఉన్నతాధికారులతో చర్చించి వచ్చే నెల నుంచి పింఛన్ అందజేస్తామని నమ్మబలికారు.
ఏఎంసీ మెస్ బిల్లు స్వాహా కేసులో ఉద్యోగి అరెస్ట్
అనంతపురం: అనంతపురం మెడికల్ కళాశాల (ఏఎంసీ) మెస్ బిల్లులో రూ.20 లక్షలు స్వాహా చేసిన ఉద్యోగిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను అనంతపురం రెండో పట్టణ సీఐ శ్రీకాంత్ యాదవ్ బుధవారం వెల్లడించారు. మెడికల్ కళాశాలలో మహిళా విద్యార్థినులకు సంబంధించిన మెస్ బిల్లులను హాస్టల్ బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేయించాల్సి ఉంది. అయితే ఆ విభాగంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న వాణి అలియాస్ ఎస్.ఓబులేశ్వరి ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ తన వ్యక్తిగత ఫోన్ నంబర్‌కు మెస్ బిల్లుల మొత్తాన్ని బదిలీ చేయించుకున్నారు. కొన్ని నెలలుగా మెస్ బిల్లుల మొత్తం హాస్టల్ బ్యాంకు ఖాతాకు జమ కాకపోవడంతో జీఎంసీ అప్పటి ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావు ఆరా తీశారు. దీంతో వాస్తవాలు బయటపడడంతో ఈ అంశంపై విచారణకు ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీని వేశారు. ప్రాథమిక విచారణ అనంతరం అక్రమాలు బహిర్గతం కావడంతో నలుగురు డాక్టర్లతో కూడిన మరో కమిటీ ద్వారా సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం ఇచ్చిన నివేదిక ఆధారంగా డాక్టర్ మాణిక్యరావు ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు వాణిపై కేసు నమోదు చేశారు. పక్కా ఆధారాలతో బుధవారం వాణి అలియాస్ సాకే ఓబులేశ్వరిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.