
జమ్మూకశ్మీర్‌కు బయలుదేరిన క్రీడాకారులు
అనంతపురం: ఈ నెల 15 నుంచి 19 వరకు జమ్మూ కశ్మీర్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే జాతీయ స్థాయి జూడో పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టు తరఫున పాల్గొనేందుకు జిల్లా క్రీడాకారులు తరలి వెళ్లారు. అండర్–14 బాలబాలికల విభాగంలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి ఏపీ జట్టులో లాస్య, నందిని, విక్రాంత్, యశ్వంత్, అప్జల్, అస్విత చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ప్రయాణమైన క్రీడాకారులకు అనంతపురం రైల్వే స్టేషన్‌లో ఎస్‌జీఎఫ్ ఉభయ జిల్లాల కార్యదర్శులు సుగణమ్మ, అంజన్న, జిల్లా కో–ఆర్డినేటర్ ఎల్.నాగరాజు, చల్లా ఓబులేసు, వేణుగోపాల్, కోటప్ప, శకుంతల, కోచ్ ప్రతాప్‌రెడ్డి ఘనంగా వీడ్కోలు పలికారు. జాతీయ స్థాయి లోనూ ప్రతిభ చాటాలని పిలుపునిచారు. క్రీడాకారులతో పాటు టీం మేనేజర్ ముస్తఫాకుమార్‌రాజా తరలివెళ్లారు.