
రాజమండ్రి వద్ద రోడ్డు ప్రమాదంలో రావికమతం వ్యక్తి మృతి
రావికమతం: రాజమండ్రి వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో రావికమతం గ్రామానికి చెందిన ముక్కా నాగేశ్వరరావు(53) మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముక్కా నాగేఽశ్వరరావు కడియం నర్సరీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా వ్యాన్‌లో వెళుతుండగా రాజమండ్రి వద్ద టైర్ పాంక్చర్ అయ్యింది. పంక్చర్ వేయించడానికి నాగేశ్వరరావు రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని రాజమండ్రి ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించగా మంగళవారం మృతి చెందాడు. మృతుడికి భార్య సత్యవతి, కుమారుడు హేమంత్ (25), కుమార్తె (22) ఉన్నారు. ఈ ఘటనపై రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.