
బైక్‌ల దొంగ అరెస్ట్
అచ్యుతాపురం రూరల్ : వేర్వేరు చోట్ల ఐదు బైకులను దొంగతనం చేసిన కశింకోట మండలం చెరకాం గ్రామానికి చెందిన రెడ్డి పైడంనాయుడు పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ నమ్మి గణేష్, ఎస్‌ఐ సుధాకర్ సోమవారం అచ్యుతాపురం కూడలిలో తనిఖీలు చేస్తుండగా టీవీఎస్ మోపెడ్‌పై వస్తున్న రెడ్డి పైడంనాయుడు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టగా వేర్వేరు చోట్ల 5 బైకులు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అచ్యుతాపురం పోలీసులు తెలిపారు.