
స్థలం ఆక్రమణపై ఫిర్యాదు
పూర్వీకుల నుంచి తన వాటాగా వచ్చిన స్థలాన్ని తన సోదరుడు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని కశింకోట మండలం వెదురుపర్తి గ్రామానికి చెందిన దివ్యాంగుడు నెల్లిముక్కు అప్పలకొండ అర్జీ అందజేశారు. తన తండ్రి అప్పన్నకు గ్రామంలో ఉన్న 6 సెంట్లను గ్రామపెద్దలు మూడు భాగాలుగా విభజించి కుమారులకు కేటాయిస్తూ తీర్మానం చేశారని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అయినా పెద్ద తమ్ముడు ఈశ్వరుడు దౌర్జన్యంగా తన సథలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడని, అతని నుంచి రక్షణ కల్పించి, స్థలం ఇప్పించాలని వేడుకున్నాడు.