నేడు ఉపమాకలో తొలి ఏకాదశి పూజలు | - | Sakshi
Sakshi News home page

నేడు ఉపమాకలో తొలి ఏకాదశి పూజలు

Jul 6 2025 6:49 AM | Updated on Jul 6 2025 6:49 AM

నేడు ఉపమాకలో తొలి ఏకాదశి పూజలు

నేడు ఉపమాకలో తొలి ఏకాదశి పూజలు

నక్కపల్లి: తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు. ఉదయం 5 గంటలకు కొండపై మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం జరుగుతుందన్నారు. అనంతరం మధ్యాహ్నం 12.30 వరకు భక్తులకు దర్శనాలు కల్పిస్తామన్నారు. విరామం అనంతరం తిరిగి సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు దర్శనాలు ఉంటాయన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు భక్తులతో సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణ కార్యక్రమం జరుగుతుందన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఉపమాకకు చెందిన శ్రీనివాస భక్త సమాజం వారిచే ఉపమాక గరుడాద్రి పర్వతం చుట్టూ గిరి ప్రదక్షణ జరుగుతుందన్నారు. రాత్రి 7 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక భజన కార్యక్రమాలు ఉంటాయని ప్రసాదాచార్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement