
ఇది పాఠశాలే.. నమ్మండి
ముంచంగిపుట్టు: మండలంలో మాకవరం పంచాయతీ లబుడుపుట్టు జీపీఎస్ పాఠశాల పశువుల పాకను తలపిస్తోంది. ఇక్కడ 32 మంది విద్యార్థులు చదువుతున్నారు. పక్కా భవనం లేకపోవడంతో గతేడాది వారి తల్లిదండ్రులు చందాలు వేసుకుని తాత్కాలికంగా రేకుల షెడ్డును నిర్మించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. గతంలో ఇక్కడ పని చేసిన ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లిపోయారు.ఒడియా వలంటీర్‌తో ప్రస్తుతం పాఠశాల నడుస్తోంది. జిల్లా అధికారులు స్పందించి పాఠశాలకు పక్కా భవనం నిర్మించి, ఉపాధ్యాయుడిని నియమించాలని మాకవరం సర్పంచ్ గంగాధర్, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను, స్థానిక గిరిజనులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఎంఈవో–1 కృష్ణమూర్తి దృష్టికి తీసుకువెళ్లగా స్కూల్ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు.
వర్షాలకు పాడైన రేకుల షెడ్డు
ఉపాధ్యాయుడు లేకపోవడంతో
వలంటీరే దిక్కు