
5 నుంచి తుది విడత చందనం అరగదీత
సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈ నెల 5 నుంచి తుది(4వ) విడత చందనం అరగదీతను ప్రారంభించేందుకు దేవస్థానం వైదిక, అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బుధవారం చందనం చెక్కలను అరగదీతకు అనువుగా ఉద్యోగి సాంబ ముక్కలుగా కోశారు. ఆలయ ఏఈవో ఆనంద్‌కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ నెల 10న ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని ఆ రోజు స్వామికి తుది విడతగా మూడు మణుగుల(సుమారు 125 కిలోలు) పచ్చి చందనం సమర్పిస్తారు. ఆ చందనాన్ని సమకూర్చేందుకు అరగదీతను చేపట్టనున్నారు. ఏడాదిలో స్వామికి నాలుగుసార్లు మూడు మణుగుల చొప్పున చందనాన్ని సమర్పిస్తారు. చందనోత్సవం రోజు, వైశాఖ పౌర్ణమి, జ్యేష్ట పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో ఈ చందన సమర్పణ ఉంటుంది.