
రేషన్ కష్టాలు ప్రారంభం
సాక్షి,పాడేరు: కూటమి ప్రభుత్వం ఎండీయూ వాహనాల వ్యవస్థ రద్దుతో గిరిజనులు రేషన్ సరుకులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మారుమూల గ్రామాల్లో ఈ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పాడేరు మండలం మారుమూల దేవాపురం డిపో పరిధిలోని అన్ని గ్రామాలు 2 నుంచి 5కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పులుసుమామిడి గ్రామానికి చెందిన గిరిజనులు బుధవారం రెండున్నర కిలోమీటర్ల దూరంలోని దేవాపురానికి వర్షంలో వెళ్లి రేషన్ బియ్యం పొందారు.కొందరు రూ.50ఖర్చు పెట్టి ఆటోలను ఆశ్రయించగా, కొందరు కాలినడకన ఇబ్బందులు పడుతూనే పులుసుమామిడి గ్రామానికి చేరుకున్నారు. వంట్లమామిడి పంచాయతీ పూలబంద డీఆర్ డిపో రెండు రోజులుగా తెరచుకోకపోవడంతో గిరిజనులకు ఈ నెల నిత్యావసరాలు అందలేదు.

రేషన్ కష్టాలు ప్రారంభం

రేషన్ కష్టాలు ప్రారంభం