
కత్తితో బెదిరించి రాజవొమ్మంగిలో చోరీ
రాజవొమ్మంగి: సినీపక్కీలో కత్తితో బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన రాజవొమ్మంగిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఎంకే రైస్ మిల్లు ఎదురుగా ఉన్న ఇంట్లో రత్నకుమారితో పాటు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. అందరు నిద్రలో ఉండగా దొంగ కిటికీలో నుంచి ఇంట్లోకి చొరబడ్డాడు. చప్పుడు కావడంతో రత్నకుమారి మెలకువ వచ్చి చూడగా కత్తి చూపించి బెదిరించాడు. బీరువాలోని రూ.70 వేలు నగదు, 40 గ్రాముల బంగారు ఆభరణాలు పట్టుకుపోయాడని బాధితురాలు తెలిపారు. సమాచారం అందుకున్న సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ నరసింహమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పాడేరు నుంచి వచ్చిన క్లూస్‌టీం నిపుణులు ఇంట్లో వేలిముద్రలు సేకరించారు. తన కుమార్తె వివాహం కోసం కూడబెట్టిన సొమ్ము దోచుకుపోయాడని బాధితురాలు రత్నకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి బయట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు చెందిన వైర్లను దొంగ ముందే కట్ చేసి, చోరీకి పాల్పడడం గమనార్హం.

కత్తితో బెదిరించి రాజవొమ్మంగిలో చోరీ