
క్షయ నివారణకు ప్రత్యేక చర్యలు
చింతపల్లి: జిల్లాలో కుష్టు, క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ప్రోగ్రాం మేనేజ్‌మెంట్ అఽధికారి మరియు క్షయ,కుష్టు నియంత్రణ అధికారి డాక్టర్ ఎం.కిరణ్ కుమార్ అన్నారు. మండలంలో గల లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులను తనిఖీ చేశారు. ప్రతి కాంట్రాక్ట్‌ను పరిక్షించి సక్రమంగా చికిత్స చేయాలన్నారు. మండల టీబీ యూనిట్ ఎస్‌టీఎస్‌లు గుర్తించిన క్షయ రోగులను సందర్శించి సకాలంలో మందులు పంపిణీ చేయాలని,ఏదైనా సమస్యలు ఉంటే టిబి యూనిట్‌కు తెలియజేయాలని సూచించారు. పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ జానకి, శివప్రసాద్, ఫార్మసిస్టు సుధారాణి, ఎస్‌టిఎస్ ప్రసాద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.