
త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు
చింతపల్లి: గిరిజనులు జన్‌మన్ పథకంలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిని పూర్తి చేసుకోవాలని జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ సి.బాబు అన్నారు. మండలంలో చిన్నగెడ్డ గ్రామంలో ఆయన బుధవారం పర్యటించారు. గ్రామంలోని పీఎం జన్‌మన్ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి 4,307 ఇళ్లు మంజూరైనట్టు చెప్పారు. ఇందులో 1,440 ఇళ్లు పునాది స్థాయిలోను, రూఫ్ లెవిల్‌లో 1,141ఇల్లు, శ్లాబ్ స్థాయిలో 117 ఉండగా, 1504 వరకు ఇంకా ప్రారంభాల్సి ఉందన్నారు. ఇల్లు త్వరితంగా పూర్తి చేసుకున్నట్లయితే స్థాయిని బట్టి జియో ట్యాగింగ్ చేసి బిల్లు మంజూరు చేస్తామన్నారు.బిల్లులు చెల్లించేందుకు నిధులు కొరత లేదన్నారు. పునాదికి రూ.70వేలు, రూఫ్ స్థాయికి రూ.90వేలు, శ్లాబ్ లెవిల్‌కి రూ.40వేల బిల్లును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడంతో పాటు అదనంగా మరో రూ.లక్ష చెల్లిస్తామన్నారు. చింతపల్లి, జీకే వీధి మండలాల ఏఈలు రమణబాబు, సూరిబాబు సిబ్బంది ఉన్నారు.