
ఏయూలో ఆస్ట్రేలియా కార్నర్?
మద్దిలపాలెం(విశాఖ): యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన ప్రతినిధుల బృందం మంగళవారం ఆంధ్ర యూనివర్సిటీని సందర్శించింది. ఈ సందర్భంగా ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్‌తో వారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలిసి ఇంజనీరింగ్ కోర్సులను సంయుక్తంగా నిర్వహించడంపై ప్రాథమిక చర్చలు జరిపారు. అదేవిధంగా ఏయూ ప్రాంగణంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా కార్నర్ ఏర్పాటు చేసే దిశగా కూడా చర్చలు సాగాయి. సంయుక్త కోర్సుల నిర్వహణకు అవసరమైన విధివిధానాలు, నియమావళిని రూపొందించిన తర్వాత మరోసారి చర్చలు జరపాలని ఇరువర్గాలు నిర్ణయించాయి. ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనుంజయ్ రావు, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా గ్లోబల్ గ్రోత్ అండ్ అడ్వకసీ విభాగం డైరెక్టర్ నషీద్ చౌదరి, గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ మేనేజర్ బ్రోడెరిక్ మైకోప్, ఏయూ ఆర్ అండ్ డి విభాగం డీన్ ఆచార్య వి. వల్లికుమారి, ఆచార్య డి.లలిత భాస్కర్ పాల్గొన్నారు.
మోదమ్మను దర్శించుకున్నమాజీ మంత్రి అమర్‌నాఽథ్
సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం మోదకొండమ్మతల్లి పాదాలు గుడిని వైఎస్సార్‌సీపీ చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి,మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాఽథ్ మంగళవారం దర్శించుకున్నారు.మోదమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా అమర్‌నాథ్‌ను అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి,చెట్టి వినయ్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ కార్యక్రమంలో పెదబయలు మాజీ ఎంపీపీలు జర్సింగి సూర్యనారాయణ,సల్లంగి ఉమామహేశ్వరరావు, రూడకోట సర్పంచ్ కాతారి సురేష్‌లు పాల్గొన్నారు.

ఏయూలో ఆస్ట్రేలియా కార్నర్?