
రెవెన్యూ ఫిర్యాదులపైప్రత్యేక దృష్టి
● డీఆర్వో పద్మలత
సాక్షి,పాడేరు: రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని డీఆర్వో కె.పద్మలత ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ నుంచి 22 మండలాల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.భూముల రీసర్వే,మీకోసం ఫిర్యాదుల పరిష్కారం,నీటి పన్నులు,గృహనిర్మాణాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ మారేడుమిల్లి,కొయ్యూరు, జీకే వీధి మండలాల్లో భూముల రీసర్వే సక్రమంగా జరగడం లేదని,ఆ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మ్యుటేషన్లు చేసే ముందు ఆయా గ్రామాల్లోని ప్రజలకు సమాచారం అందించి గ్రామసభలు నిర్వహించాలని తెలిపారు.ఈ సమావేశంలో సర్వేశాఖ ఏడీ దేవేంద్రుడు పాల్గొన్నారు.