పాడేరు..విలక్షణ తీరు | Sakshi
Sakshi News home page

పాడేరు..విలక్షణ తీరు

Published Thu, May 9 2024 7:45 AM

పాడేర

ఓటర్ల వివరాలు

మొత్తం ఓటర్లు : 2,41,445

పురుషులు : 1,17, 530

సీ్త్రలు : 1,23, 909

ఇతరులు : 6

నియోజకవర్గ స్వరూపం

పర్యాటకంగా ప్రత్యేక గుర్తింపు అల్లూరి పేరిట జిల్లాగా ఖ్యాతి వైఎస్సార్‌సీపీ వైపే గిరిజనం

జిల్లాల పునర్విభజనతో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరిట జిల్లా కేంద్రంగా పాడేరు అవతరించింది. రెండేళ్ల క్రితం వరకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్న పాడేరు నియోజకవర్గానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది 1967లో ఆవిర్భవించింది. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పాడేరు నియోజకవర్గంలో కొన్ని మండలాలను వేరు చేసి, మరికొన్నింటిని కలిపారు. అంతకుముందు పాడేరుతోపాటు జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట మండలాలు ఈ నియోజకవర్గంలో ఉండేవి. 2009లో అరకులోయ నియోజకవర్గం ఏర్పడగా హుకుంపేట, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాలను అందులో కలిపారు. చింతపల్లి నియోజకవర్గాన్ని రద్దు చేసి చింతపల్లి, కొయ్యూరు, గూడెంకొత్తవీధి మండలాలను పాడేరులో ఉంచారు. 2009 సాధారణ ఎన్నికల్లో పాడేరు శాసనసభ స్థానాన్ని కాంగ్రెస్‌ కై వసం చేసుకుంది. చింతపల్లి నియోజకవర్గంలో అంతకు ముందున్న రోలుగుంట మండలం నర్సీపట్నం నియోజకవర్గంలో చేరింది. కొత్తగా ఏర్పడిన పాడేరు నియోజకవర్లంలో మూడు సార్లు ఎన్నికలు జరగ్గా ఒకసారి కాంగ్రెస్‌, రెండు సార్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు.

● పాడేరు నియోజకవర్గంలోని సామాజిక వర్గాల్లో మొదటి స్థానంలో భగత, రెండో స్థానంలో కొండదొర, మూడవ స్థానంలో వాల్మీకి, తరువాత స్థానంలో ఆదివాసీ (పీవీటీజీ)లున్నారు. 2014, 2019 ఎన్నికల్లో భగత కులానికి చెందిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గిడ్డి ఈశ్వరి (చివర్లో టీడీపీకి మారారు), కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి విజయం సాధించారు.

పాడేరు: జిల్లా కేంద్రంగా పాడేరు ఏర్పాటైన నాటి నుంచి ఊహించని స్థాయిలో గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం వల్ల మెజారిటీ ప్రజలు వైఎస్సార్‌సీపీ వెంటే ఉన్నారు. చంద్రబాబు హయాంలో విడుదలైన బాకై ్సట్‌ తవ్వకాల జీవోపై పోరాటానికి ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనుల పక్షాన నిలిచారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీవోను రద్దు చేసి గిరిజనుల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించారు. జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటుచేసి కార్పొరేట్‌ వైద్యాన్ని చేరువచేశారు. ఇలాంటివి ఎన్నో శాశ్వత ప్రయోజన కార్యక్రమాలు చేపట్టి గిరిజన సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చారు.

నియోజకవర్గ ప్రత్యేకతలు

● ఏటా మేలో నిర్వహించే పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతర రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందింది.

● పాడేరు మండలం వంజంగిలో మేఘాల కొండ విశ్వవ్యాప్తి పొందింది.

● జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది.

● చింతపల్లి మండలం లంబసింగి, చెరువులవేనం, తాజంగి రిజర్వాయర్‌ ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఏటా చలికాలంలో ఒక్కసారైనా సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.

● సీలేరు జలవిద్యుత్‌ కేంద్రం డ్యామ్‌, గాదిగుమ్మి జలపాతం, అల్లూరి నడయాడిన మంప ప్రాంతాలు పర్యాటకంగా గుర్తింపు పొందాయి.

1967లో నియోజకవర్గం ఏర్పడింది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ 5సార్లు, జనతా పార్టీ ఒకసారి, బీఎస్పీ ఒకసారి, టీడీపీ మూడు సార్లు, వైఎస్సార్‌సీపీ రెండు సార్లు విజయం సాధించాయి.

● 1978తో జనతా పార్టీ తరఫున గిడ్డి అప్పలనాయుడు కాంగ్రెస్‌కు చెందిన తమర్భ చిట్టినాయుడుపై 2507ఓట్లతో గెలిచారు.

● 2004లో బహుజన సమాజ్‌ వాదీ పార్టీ (బీఎస్పీ)తరఫున లకే రాజారావు విజయం సాధించారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థి సమ్మెట రవిశంకర్‌పై 7555 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఏపీ రాష్ట్ర రాజకీయ చరిత్రలో తొలిసారిగా బహుజన సమాజ్‌ వాదీ పార్టీ పాడేరు నియోజకవర్గంలో విజయం సాధించడం విశేషం.

● 2009 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పసుపులేటి బాలరాజు ప్రత్యర్థి అభ్యర్థి గొడ్డేటి దేముడుపై 587 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

● 2014లో ఎమ్మెల్యేగా వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన గిడ్డి ఈశ్వరి ప్రత్యర్థి గొడ్డేటి దేముడుపై 26,243 ఓట్లతో గెలిచారు. అనంతరం 2018లో ఆమె టీడీపీలో చేరారు.

● 2019లో జరిగిన ఎన్నికలో వైఎస్సార్‌సీపీ తరఫున కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరిపై 42,804 ఓట్ట మెజారిటీతో విజయం సాధించారు.

● ఐదు మండలాలు ఉండగా అన్నిస్థానాల్లో జెడ్పీటీసీ, జి.మాడుగుల మినహా మిగతాఎంపీపీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.

రాజకీయ

పోరు

పాడేరు..విలక్షణ తీరు
1/4

పాడేరు..విలక్షణ తీరు

పాడేరు..విలక్షణ తీరు
2/4

పాడేరు..విలక్షణ తీరు

పాడేరు..విలక్షణ తీరు
3/4

పాడేరు..విలక్షణ తీరు

పాడేరు..విలక్షణ తీరు
4/4

పాడేరు..విలక్షణ తీరు

Advertisement
Advertisement