నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
కై లాస్‌నగర్(బేల)/ఆదిలాబాద్‌రూరల్/ఇచ్చోడ/సిరికొండ: నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని పంచాయతీ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ టి.వెంకన్న అన్నారు. బేల మండలంలోని బేల, సిర్సన్న, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాందా(టి), యాపల్‌గూడ, ఇచ్చోడ మండల కేంద్రం, సిరికొండ మండల కేంద్రంలోని నామినేషన్ క్లస్టర్ కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణకు చేపట్టిన ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీవైఎస్‌వో శ్రీనివాస్, ఎంపీడీవోలు ఆంజనేయులు, నరేశ్, మహ్మద్ రయిస్‌ఉల్లా, ఎన్నికల అధికారులు తదితరులున్నారు.


