రెండోవిడత నామినేషన్లు షురూ
కై లాస్‌నగర్: రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం మొదలైంది. జిల్లాలో ఎనిమిది మండలాల్లోని 156 గ్రామ పంచాయతీలు, 1,260 వార్డు స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆశావహులు తొలిరోజునే ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన క్లస్టర్ కేంద్రాలకు చేరుకుని రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. తొలి రోజున సర్పంచ్ స్థానాలకు 83 దాఖలు కాగా, వార్డు స్థానాలకు 30 నామినేషన్లు అందినట్లుగా జిల్లా పంచాయతీ అధికారి జి.రమేశ్ తెలిపారు. అత్యధికంగా భీంపూర్ మండలంలో తొలి రోజునే 21 నామినేషన్లు వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఈ నెల 2వరకు స్వీకరించనున్నారు.
ఆయా మండలాల వారీగా
అందిన నామినేషన్ల వివరాలు
మండలం సర్పంచ్ వార్డుమెంబర్
ఆదిలాబాద్‌రూరల్ 11 2
మావల 07 8
బేల 08 3
జైనథ్ 15 3
సాత్నాల 04 4
భోరజ్ 11 2
తాంసి 06 0
భీంపూర్ 21 8


