విభేదాలు వీడుదాం.. సమష్టిగా సాగుదాం
కై లాస్‌నగర్: విభేదాలు వీడి పార్టీ పటిష్టత కోసం కలిసికట్టుగా ముందుకు సాగుదామని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేశ్‌జాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్‌లో ఆదివారం పార్టీ జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్గాలుగా ఉన్న నేతలంతా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ పటిష్టత కోసం సమష్టిగా ముందుకు సాగుదామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులను గెలిపించడంతో పాటు పరిషత్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. సమావేశంలో డీసీసీబీ, గ్రంథాలయ చైర్మన్‌లు అడ్డి భోజారెడ్డి, మల్లెపూల నర్సయ్య, మాజీ ఎంపీ సోయం బాపూరావ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, ఆడె గజేందర్, సీనియర్ నాయకులు గండ్రత్ సుజాత, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, బాలురి గోవర్ధన్ రెడ్డి, అల్లూరి సంజీవ్ రెడ్డి, చరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


