అప్రమత్తతతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట
ఆదిలాబాద్‌టౌన్: సైబ ర్ నేరాలను అప్రమత్తతతో అడ్డుకట్ట వేయవచ్చని ఎస్పీ అఖిల్ మ హాజన్ అన్నారు. ఆది వారం ఎస్పీ కార్యాలయంలో సైబర్ నేరా లకు సంబంధించిన వి వరాలు వెల్లడించారు. రాష్ట్రంలో సైబర్ నేరాలను అడ్డుకోవడానికి ‘ఫ్రాడ్‌కా ఫుల్‌స్టాప్’ అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ వారంలో 25 సైబర్ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. డిసెంబర్ మొదటి వారం నుంచి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ వారంలో ఆదిలాబాద్ పట్టణంలోని వన్‌టౌన్ పరిధి లో ఇన్‌స్ట్రాగామ్‌లో దుస్తులు కొనుగోలు చేసి రూ.1,850లు నకిలీ వెబ్‌సైట్ ద్వారా చెల్లించగా, అతడి అకౌంట్ నుంచి రూ.29,600 పోగొట్టుకున్నట్లు తెలిపా రు. ఉట్నూర్‌లో పార్ట్‌టైమ్ జాబ్‌పేరిట ఇన్‌స్ట్రాగామ్‌లో మెస్సేజ్ రాగా మహిళ నుంచి రూ.50వేలు కాజేశారు. మావల మండలంలో వాట్సాప్‌లో వచ్చిన ఎస్‌బీఐ యోనో పేరుతో నకిలీ ఏపీకే ఫైల్ ద్వారా బాధితుడి అకౌంట్ నుంచి రూ.7వేలు కాజేసినట్లు తెలిపారు.
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
ఉద్యోగ విరమణ పొందిన పోలీసులు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదివారం ఉద్యోగ విరమణ పొందిన పీసీఆర్ ఎస్సై కె.నర్సయ్యను శాలువాతో సన్మానించి మెమోంటోను అందజేశారు.


