
జీవో 49 రద్దు చేయాలి
కైలాస్‌నగర్: ఆదివాసీలను అడవికి దూరం చేసేలా తెచ్చిన జీవో 49ను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదు ట సోమవారం ధర్నా నిర్వహించారు. పెసా వంటి గిరిజన చట్టాలు అమలు చేయకుండా ఎలాంటి గ్రా మసభలు నిర్వహించకుండా తీసుకొచ్చిన జీవో 49 ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో ఆదివాసీలు పాల్గొన్నారు.
ఎండీఎం కార్మికుల ధర్నా..
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలనే డిమాండ్‌తో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో అప్పలు తెచ్చి వంట చేయాల్సి వస్తుందన్నారు. ఎన్నికల హామీ మేరకు రూ.10వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇందులో సంఘం నాయకులు, కార్మికులు తదిత రులు పాల్గొన్నారు.