
బాధితుల సమస్యలు పరిష్కరించాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: బాధితుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 73 మంది అర్జీదారులు ఎస్పీని కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఆయా స్టేషన్ల అధికారులతో ఎస్పీ ఫోన్ ద్వారా మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యలు విన్నవించేందుకు నేరుగా రాలేని వారు వాట్సాప్‌నంబర్8712659973పై సంప్రదించవ్చని సూచించారు. ఇందులో సీసీ కొండ రాజు, ఫిర్యాదు ల విభాగం అధికారి కవిత, వామన్ పాల్గొన్నారు.