
బాధలు విని.. భరోసా కల్పించి
కళాశాలలో ప్రవేశం కల్పించండి..
అయ్యా.. మేము ఉట్నూర్ మండలంలోని రాముగూడకు చెందిన కోలాం తెగ గిరిజనులం. మా బిడ్డలు ఇటీవల పదో తరగతి పాసయ్యారు. నైతం సోనిబాయికి 412 మార్కులు, కుమ్రం సీతాబాయికి 417 మార్కులు వచ్చాయి. గిరిజన సంక్షేమ ఆశ్రమ గురుకుల కళాశాలల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేశాం. ఇటీవల జరిగిన కౌన్సెలింగ్‌లో సీటు దొరకలేదు. ప్రైవేట్‌లో వేలాది రూపాయలు పెట్టి చదివించే స్థోమత మాకు లేదు. మాపై దయచూపి గిరిజన ఆశ్రమ కశాశాలల్లో సీటు ఇప్పించాలి.
– నైతం భీంరావు, కుమ్ర లక్ష్మణ్, ఉట్నూర్
కై లాస్‌నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా సత్వరం పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అ న్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. తమ గోడు విన్నవించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వారి నుంచి అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోనిచాబ్రాతో కలిసి ఆయన అర్జీ లు స్వీకరించారు. అనంతరం వాటిని సంబంధిత అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 98 అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన..
అర్జీలు స్వీకరించిన కలెక్టర్
ప్రజావాణికి 98 దరఖాస్తులు

బాధలు విని.. భరోసా కల్పించి