
జీపీ కార్మికుల ఆందోళన
కై లాస్‌నగర్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికులు సోమవారం ఆందోళన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కా ర్యదర్శి కిరణ్ మాట్లాడారు. మూడు నెలలుగా వేతనాలు అందక కార్మికులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం డీపీవో రమేశ్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఇందులో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న, గ్రామ పంచాయతీ కా ర్మికుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సోపన్‌రా వు, వెంకట్రావు, అశోక్, లస్మన్న పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట లంబాడాల ధర్నా
లంబాడాలకు 1977 ఓటరు జాబితా ఆధారంగా కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఇందులో లంబాడా హక్కుల పోరాట సమితి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహన్, నాయకులు జాదవ్ కృష్ణ, రాథోడ్ రోహిదాస్, జాదవ్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
5వ తేదీలోగా రిపోర్టు చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీటు పొందిన వారు ఈనెల 3లోగా సెల్ఫ్ రిపో ర్టు చేసుకోవాలని, కళాశాలలో 5వ తేదీలోగా రిపోర్టు చేయాలని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామ ర్స్ డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ రఘు గణపతి తెలిపారు. ఒకటి, రెండు, మూడో విడతల్లో సీటు పొంది కూడా అడ్మిషన్ పొందని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన సూచించారు.
దరఖాస్తుల ఆహ్వానం
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అగ్రికల్చర్ కళాశాలలో యూజీ కోర్సుల్లో కంబైన్డ్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల డీన్ శ్రీధర్ చౌహాన్ ప్రకటనలో తెలిపారు. ఈనెల 18 వరకు గడువు ఉందని పే ర్కొన్నారు. అగ్రికల్చర్ బీఎస్సీ హోమ్ సైన్స్, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్, బీటెక్ ఫుడ్ టెక్నాల జీ, బ్యాచ్‌లర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ (బీవీఎస్సీ) బ్యాచ్‌లర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ (బీఎఫ్‌ఎస్సీ), బీఎస్సీ హార్టికల్చర్ తదితర కోర్సులు ఉన్నట్లు తెలిపారు. వివరాల కోసం కళాశాలలో సంప్రదించాలని సూచించారు.

జీపీ కార్మికుల ఆందోళన