
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
పేషెంట్లు పూర్తయ్యే వరకూ..
జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న జైనథ్ మండలం దీపాయిగూడ గ్రా మానికి చెందిన నూతుల కళ్యాణ్‌రెడ్డి రేడియాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు. ఎలాంటి ప్రైవేట్ ప్రాక్టీస్ చేయరు. ఉదయం 9 గంటలకు విధులకు హాజరవుతారు. సమయంతో సంబంధం లేకుండా పేషెంట్లు పూర్తయ్యేంత వరకు సేవలందిస్తారు. స్కానింగ్, సేవల కోసం నిత్యం 300 నుంచి 400 మంది ఇక్కడికి వస్తుంటారు. ఏరోజుకు ఆరోజు నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు రిపోర్టులు సైతం అందిస్తూ రోగులు ఇబ్బందులు పడకుండా చూస్తున్నారు. సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు సైతం అందుకున్నారు. ఉట్నూర్ మండలం పులి మడుగు గ్రామానికి చెంది న పార్వతి–శ్రీరాముల దంపతుల కుమారుడు డాక్టర్ ఆడె విఠల్ జనరల్ రిమ్స్‌లో నాలుగేళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నాడు. ఈయన వరంగల్‌లోని కేఎంసీలో వైద్యవిద్య అభ్యసించగా, ఢిల్లీలో పీజీ పూర్తి చేశాడు. అక్కడే అంబేద్కర్ ఆస్పత్రిలో వైద్యుడిగా సేవలు అందించా డు. జిల్లా ప్రజలకు వైద్యసేవలందించాలని తండ్రి కోరిక మేరకు రిమ్స్‌లో వైద్యుడిగా చేరి ఈ ప్రాంతంపై మమకారం చాటుతున్నాడు.
ఢిల్లీ వదిలి.. రిమ్స్‌కు వచ్చి

వాతావరణం