
● ‘గ్రీవెన్స్’ సమస్య పరిష్కారంపై హర్షం
కలెక్టర్‌ను సన్మానించి ..
కృతజ్ఞతలు తెలిపి
కై లాస్‌నగర్: ప్రజావాణిలో నివేదించిన సమస్య పరిష్కరించడంపై భీంపూర్ మండలం డబ్బకుచ్చి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు గ్రీవెన్స్‌కు వచ్చి కలెక్టర్ రాజర్షి షాను సత్కరించారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల 15ఏళ్ల క్రితం మూతపడింది. దీంతో విద్యార్థులు మూడు కిలోమీటర్ల దూరంలోని వడ్‌గాంవ్‌కు వెళ్లి చదువుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలువురు చదువుకు దూరమవుతున్నారని, ఈ తీరుపై గ్రామస్తులు జూన్ 23న ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. మూతపడ్డ బడిని తెరపించాలని కోరారు. స్పందించిన కలెక్టర్ ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు. మరుసటి రోజే గ్రామాన్ని సందర్శించిన విద్యాశాఖ అధికారులు పాఠఽశాలను పునఃప్రారంభించారు. కలెక్టర్ చొరవపై హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు సోమవారం ఆయన్ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. తమ గ్రామాన్ని సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. కాగా పాఠశాలలో చదివే 30 మంది విద్యార్థులకు అవసరమైన 300 నోట్ బుక్స్‌ను పట్టణానికి చెందిన న్యాయవాది కె.విశ్వనాథ్ తన సమనుజ్ఞ ట్రస్ట్ ద్వారా కలెక్టర్ చేతుల మీదుగా వారికి అందజేశారు. ఇందులో డీఈవో శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.