
మహలనోబిస్‌కు ఘన నివాళి
కై లాస్‌నగర్: జాతీయాదాయం అంచనా వేయడంలో, ప్రభుత్వ విధానాలు రూపొందించడంలో గణాంకాలు కీలకపాత్ర పోషిస్తాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతి పురస్కరించుకుని జాతీయ గణాంక దినోత్సవాన్ని కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో ప్రణాళికశాఖ అధికారులు, ఉద్యోగులతో కలిసి ప్రశాంత చంద్ర మహలనోబిస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గణాంక కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు మహలనోబిస్ వివిధ సంస్థలు, పద్ధతులను ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి బి.వెంకటరమణ, డివిజనల్, మండల గణాంక అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.