
అంగన్‌వాడీల్లో ‘ఎఫ్‌ఆర్‌ఎస్’
ఆదిలాబాద్‌టౌన్: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఇచ్చే పౌష్టికాహారం, లబ్ధిదారులకు ఇచ్చే సరకులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూలై 1నుంచి ఆయా కేంద్రాల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా వీటిని అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే గ ర్భిణులు, బాలింతలు, చిన్నారుల ముఖచిత్రంతో కూడిన వివరాలను అంగన్‌వాడీ టీచర్లు మొ బైల్‌లో ట్రాకర్ యాప్‌లో నమోదు చేశారు. ప్ర స్తుతం ఆధార్ అనుసంధానం చేస్తున్నారు. ఈ ప్ర కియ పూర్తయిన వెంటనే ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు కా నుందని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే కేంద్రం ఆదేశాలు..
లబ్ధిదారులందరికీ ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేసేందుకు కేంద్ర మహిళాశిశు సంక్షేమ శాఖ నుంచి ఆదేశాలు రావడంతో జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ నుంచి కొనసాగుతుండగా కొందరికి ఫోన్‌లో ట్రాకర్ పనిచేయకపోవడంతో జాప్యం అవుతోంది.
అక్రమాలకు చెక్ పెట్టేందుకు..
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పక్కదారి పడుతుందనే ఆరోపణలున్నాయి. లబ్ధిదారులకు సరుకులు సక్రమంగా పంపిణీ చేయకపోవడం, కొందరు కేంద్రానికి రాకపోయినా వచ్చినట్లు హాజరు నమోదు చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉన్నతాధికారుల తనిఖీల్లోనూ ఈ విషయాలు పలుమార్లు బయటపడిన సందర్భాలున్నాయి. ఇక నుంచి ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని ప్రభుత్వం యోచించింది. ఈ విధానం ద్వారా పిల్లలకు ఇచ్చే బాలామృతం, గుడ్లు, పాలు, మురుకులతో పాటు మెనూ ప్రకారం భోజనం అందనుంది. అలాగే కేంద్రానికి వస్తేనే ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా హాజరు నమోదు కానుంది. నెలలో ఎంత మంది లబ్ధిదారులు వచ్చారు.. ఎంత మందికి సరుకులు పంపిణీ చేశారు.. తదితర వివరాలు ఇక ఇట్టే తెలుస్తాయి. కేంద్రాల్లో సరుకుల నిల్వ కూడా సులువుగా తెలిసిపోతుంది.
అక్రమాలకు ఇక చెక్
కేంద్రాల్లో ఫేషియల్ రికగ్నైజేషన్
లబ్ధిదారుల ముఖచిత్రం తప్పనిసరి
సరుకులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు
రేపటి నుంచి అమలు
జిల్లాలో..
అంగన్‌వాడీ కేంద్రాలు 1,283
టీచర్లు 1,192
గర్భిణులు 4,483
బాలింతలు 6,000
చిన్నారులు 51,686
సిగ్నల్ సమస్యతో జాప్యం
ఫోన్లలో సిగ్నల్ సరిగా లేక లబ్ధిదారుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ఇబ్బందిగా మారుతోంది. యాప్‌లు సక్రమంగా పనిచేయడం లేదు. రోజువారీ హాజరు నమోదు కష్టంగా మారుతోంది. కొత్తగా ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్‌లో భాగంగా ముఖ చిత్రాలను నమోదు చేయడం ఇబ్బందిగా ఉంది. అన్ని పూర్తి చేసిన తర్వాతే ఈ విధానం అమలు చేయాలి.– వెంకటమ్మ,
అంగన్‌వాడీల సంఘం జిల్లా అధ్యక్షురాలు
పకడ్బందీగా అమలు చేస్తాం
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్‌ఆర్‌ఎస్‌ను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తాం. ఇప్పటికే లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశాం. ప్రస్తుతం ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నాం. ఈ ప్రక్రియ ద్వారా సరుకులు పక్కదారి పట్టకుండా నిరోధించేందుకు ఆస్కారం ఉంటుంది. అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడుతాం.
– మిల్కా, జిల్లా సంక్షేమ అధికారి

అంగన్‌వాడీల్లో ‘ఎఫ్‌ఆర్‌ఎస్’

అంగన్‌వాడీల్లో ‘ఎఫ్‌ఆర్‌ఎస్’