
‘యూహెచ్‌సీ’ పనుల పరిశీలన
● అసంతృప్తి వ్యక్తం చేసిన ఎంఈ ● తిరిగి చేపట్టాలని కాంట్రాక్టర్‌కు ఆదేశం
కై లాస్‌నగర్: మున్సిపల్ పరిధిలోని మహాలక్ష్మివాడ కాలనీలో రూ.1.43 కోట్ల వ్యయంతో చేపట్టిన అర్బన్ హెల్త్‌సెంటర్ భవన నిర్మాణ పనులను మున్సిపల్ ఇంజినీర్ పేరిరాజు, బల్దియా డీఈ కార్తీక్ ఆదివారం పరిశీలించారు. పిల్లర్ల దశ దాటిన పనులను ప్రత్యక్షంగా పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ ప్రభుత్వ ఆమోదిత డిజైన్ ప్రకారం కాకుండా ఇష్టానుసారం చేపడుతున్నట్లుగా గుర్తించారు. ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాన్ని పూర్తిగా తొలగించి, తిరిగి నిబంధనల ప్రకారం చేపట్టాలని ఆదేశించారు. కాగా, అధికారుల ఆదేశాలను కాంట్రాక్టర్ అమలు చేస్తాడా లేక రాజకీయ అండతో యథావిధిగా చేపడుతారా అనేది వేచి చూడాల్సిందే.