
జయహో జగన్నాథా..
రథాన్ని లాగడానికి పోటీపడుతున్న భక్తులు
జయహో జగన్నాథా.. అంటూ భక్తులు పులకించిపోయారు. పూరి జగన్నాథుని నామస్మరణతో పట్టణ వీధులు మారుమోగాయి. ఇస్కాన్ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మథుర జిన్నింగ్ నుంచి శనివారం చేపట్టిన పూరి జగన్నాథుని రథయాత్ర వైభవంగా సాగింది. సోదరుడు బలభద్ర, సోదరి సు భద్రతో కొలువుదీరిన ఆ స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తజనం పోటీపడ్డారు. ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే శంకర్ బంగారుపిడి కలిగిన చీపుళ్లతో ఊడ్చి యాత్ర ను ప్రారంభించారు. ఆధ్యంతం శ్రీ ప్రణవానంద ప్రభూజీ బోధనలు, భక్తి గీతాలతో రథయాత్ర శోభా యమానంగా సాగింది. అనంతరం భక్తులకు ఇస్కా న్ ప్రతినిధులు ప్రసాద వితరణ చేపట్టారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. – ఆదిలాబాద్

జయహో జగన్నాథా..