
నాతోపాటే ఇద్దరు పిల్లలు
● ప్రభుత్వ పాఠశాలలకే తమ పిల్లలు ● సర్కారు బడుల బలోపేతానికి చొరవ ● తల్లిదండ్రులకు నమ్మకం కలిగించే యత్నం ● ఆదర్శం.. ఈ ఉపాధ్యాయులు
నేను తాంసి మండలంలోని కప్పర్ల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నా కూతురు ప్రజ్ఞశ్రీ 4వ తరగతి, బాబు కృష్ణ రెండో తరగతి చదువుతున్నారు. ఇద్దరిని నేను బోధన చేసే పాఠశాలలోనే చది విస్తున్నాను. గతంలో కుచులాపూర్‌లో పనిచేసిన సమయంలో అక్కడ చదివించాను. ప్రభుత్వ పాఠశాలలపై నాకు నమ్మకం ఉంది. నాతో పాటు బోధించే ఉపాధ్యాయులు అనుభవంతో పాటు ప్రావీణ్యంగలవారు. మా పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయి. నన్ను చూసి చాలా మంది తమ పిల్లలను చేర్పిస్తున్నారు. – సామనపెల్లి గంభీర్, ఉపాధ్యాయుడు