
సర్టిఫికెట్ల పరిశీలన షురూ
ఆదిలాబాద్‌టౌన్: పాలిటెక్నిక్‌లో ప్రవేశాల కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల పరి శీలన ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు కొనసాగనుంది. తొలి రోజు 105 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకోగా, 103 మంది హాజరయ్యారు. వారి సర్టిఫి కెట్లను అధికారులు పరిశీలించారు. ప్రక్రియను కోఆర్డినేటర్, కళాశాల ప్రిన్సిపాల్ రాంబాబు పర్యవేక్షించారు. ఇందులో సాయన్న, ఫాతి మా, సంజయ్ సింగ్, నర్సయ్య, శ్రీకాంత్, శ్రుతి సిబ్బంది ఉన్నారు.