మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

Jun 28 2025 8:05 AM | Updated on Jun 28 2025 8:05 AM

మత్తు

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

ఆదిలాబాద్‌: జీవితం ఎంతో విలువైనదని, ఈ మేరకు యువత, విద్యార్థులు డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రన్‌ ఫర్‌ హోప్‌ ఆంటీ డ్రగ్స్‌ అవేర్నెస్‌ కార్యక్రమంలో భాగంగా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో 5కే రన్‌ నిర్వహించారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దన్నారు. చదువుతో పాటు వ్యాయామం, క్రీడలకు ప్రాధాన్యమిచ్చి తల్లిదండ్రులు, పుట్టిన ఊరు గర్వపడేలా ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. కలెక్టర్‌ రాజర్షి షా మాట్లాడుతూ.. మత్తు పదార్థాలను పండించడం, రవాణా చేయడం, సేవించడం వంటి వాటికి పాల్పడితే ప్రభుత్వ పథకాలను నిలిపివేస్తామన్నారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు సోషల్‌ మీడియాలో చూసి డ్రగ్స్‌కు ఆకర్షితులు కావొద్దన్నారు. మత్తు పదార్థాల విషయంలో పోలీస్‌శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఆదిలాబాద్‌ శంకర్‌ మాట్లాడుతూ.. సమా జంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని మత్తు పదార్థాలతో కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలన్నారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే బొజ్జు మా ట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి నివారణకు ప్రజాప్రతినిధులుగా తమవంతు సహకారం అందిస్తామన్నారు. అనంతరం రన్‌లో విజేతలుగా నిలిచిన తొలి 15 మందికి బహుమతిగా సైకిళ్లను అందించారు. పురుషుల విభాగంలో మొదటిస్థానంలో సురేందర్‌, మహిళల భాగంలో శిల్ప నిలి చారు. కార్యక్రమంలో భాగంగా అంకోలి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నాటిక అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో డీఎఫ్‌వో ప్రశాంత్‌ బాజీరావ్‌ పాటిల్‌, ట్రెయినీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ సలోని, ఏఎస్పీ కాజల్‌, డీఎస్పీ జీవన్‌ రెడ్డి, డీవైఎస్‌వో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు

జిల్లాకేంద్రంలో ఉత్సాహంగా 5కే రన్‌

ఎకో టూరిజం అభివృద్ధికి కృషి..

ఆదిలాబాద్‌రూరల్‌: ఆదిలాబాద్‌ను ఎకో టూరిజంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మావలలోని హరితవనం పార్కును శుక్రవారం సందర్శించారు. ముందుగా ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. అర్బన్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా కాటేజెస్‌, వివిధ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మొక్క నాటా రు. అనంతరం సఫారీలో పర్యటించారు. ఆయన వెంట ఎంపీ గోడం నగేశ్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, సీసీఎఫ్‌ శర్వానంద్‌, డీఎఫ్‌వో ప్రశాంత్‌ పాటిల్‌, ఎఫ్‌డీవో రేవంత్‌ చంద్ర, ఎఫ్‌ఆర్వో శ్రీనివాస్‌రెడ్డి, బీట్‌ ఆఫీసర్లు ప్రశాంత్‌, కృష్ణ, తదితరులున్నారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి1
1/1

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement