
జైళ్లశాఖ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ పంపిణీ
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా జైలు ఖైదీలు తయారు చేసిన సీడ్ బాల్స్ పంపిణీని శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ అశోక్ మాట్లాడుతూ.. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఆదేశాల మేరకు అటవీ విస్తీర్ణం పెంచాలనే ఉద్దేశంతో 10వేల సీడ్స్ బాల్స్‌ను తయారు చేసినట్లు తెలిపారు. ఇందులో సీతాఫలం, జామ, చింత, రావి, సండ్ర, మేడి తదితర సీడ్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. జైలు బంక్‌కు వచ్చే వినియోగదారులతో పాటు ప్రజలకు 3వేల సీడ్‌బాల్స్ పంపిణీ చేశామన్నారు. అలాగే ఆసిఫాబాద్ స్పెషల్ సబ్‌జైలుకు 3,500, లక్సెట్టిపేట సబ్ జైలుకు వెయ్యి వరకు సీడ్ బాల్స్ సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో డిప్యూటీ జైలర్‌రాథోడ్ ప్రకాశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.