
‘మధ్యాహ్న’ కార్మికుల సమ్మె నోటీసు
ఆదిలాబాద్‌టౌన్: తమ సమస్యల పరిష్కారంలో భాగంగా వచ్చే నెల 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని మధ్యాహ్న భోజన కార్మికులు పేర్కొన్నారు. ఈ మేరకు డీఈవో శ్రీనివాస్‌రెడ్డికి శుక్రవారం సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాములు మాట్లాడు తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పది కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు సమ్మెలో పాల్గొననున్నట్లు తెలిపారు. మధ్యా హ్న భోజన కార్మికులకు పని భద్రత కల్పించా లని, కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని, గ్రాట్యూటీ, పెన్షన్, ఈఎస్‌ఐ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శశికళ, పుష్ప, శ్రీదేవి, రాంబాయి తది తరులు పాల్గొన్నారు.