
ఆయిల్‌పాం సాగు లాభదాయకం
తాంసి: లాభదాయకమైన ఆయిల్‌పాం సాగు కు రైతులు ముందుకు రావాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి సుధాకర్ అన్నారు. మండలంలోని హస్నాపూర్ శివారు పంటచేనులో శుక్రవారం మెగా ఆయిల్‌పాం ప్లాంటేషన్ నిర్వహించారు. స్థానిక రైతులతో కలిసి మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు దీర్ఘకాలిక పంటలు సాగుచేస్తే మంచి లాభాలు పొందవచ్చన్నారు. ఆయిల్ పాం సా గుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీని సద్వి నియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల ఇన్‌చార్జి ఉద్యాన అధికారి క్రాంతి, ఏరియా మెనేజర్ రమేశ్, రైతులు పాల్గొన్నారు.