
‘ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం’
ఆదిలాబాద్: భారత దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం సంవిధాన్ హత్య దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందన్నారు. ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, నాయకులు వేణుగోపాల్, గంగారెడ్డి, చంద్ర, విజయ్, సంతోష్‌రెడ్డి, మాధవరావు, జ్యోతి రెడ్డి, ఆకుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.