
యువకుడు ఆత్మహత్య
సాత్నాల: మానసిక స్థితి సరిగాలేక పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గౌతమ్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని జామ్ని గ్రామానికి చెందిన సోయం సతీశ్(23) జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్ ప్రైమ్ పాఠశాలలో వార్డెన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా రాత్రి జామ్ని, మేడిగూడ మధ్యలో పంట పొలాల్లో పురుగుల మందు తాగి విగత జీవుడై కనిపించాడు. మృతుని తండ్రి సోయం తులసీరామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.