
సమస్యల నివేదన
ప్రొసీడింగ్‌లిచ్చారు.. ముగ్గు పోయట్లేదు
అయ్యా.. మేము కూలీనాలి చేసుకునే నిరుపేదలం. సొంతింటి స్థలం ఉండడంతో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నాం. సర్వే చేసిన కార్యదర్శి మేము అర్హులమని నిర్ధారించారు. మాకు ప్రొసీడింగ్ లెటర్లు కూడా ఇచ్చారు. ముగ్గు పోయాలని కార్యదర్శిని కోరగా మాకు స్థలం లేదంటూ నిరాకరిస్తున్నారు. విచారణ జరిపించి న్యాయం చేయాలని విన్నవించుకుంటున్నాం.
– రాగి లలిత, గొడ్డెల అరవినా, సాయిలింగి, తలమడుగు
ఉపాధ్యాయులను నియమించాలి
మా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులు లేరనే కారణంతో ఉపాధ్యాయులను నియమించలేదు. పాఠశాలను సైతం అంగన్‌వాడీ కేంద్రంగా మార్చారు. ప్రస్తుతం ఊరిలో బడీడు పిల్లలు 30 మంది వరకు ఉన్నారు. గ్రామంలో బడి లేకపోవడంతో మూడు కిలోమీటర్ల దూరంలో గల వడ్‌గాం పాఠశాలకు వెళుతున్నారు. గతేడాది ఓ విద్యార్థిని బడికి వెళ్లే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందింది. ఈ మేరకు స్పందించి తగుచర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
– డబ్బాకూచి గ్రామస్తులు, భీంపూర్
ఆ ఏజెన్సీని బ్లాక్‌లిస్టులో పెట్టాలి
రిమ్స్‌లో 800 పోస్టులు దక్కించుకున్న మహాలక్ష్మి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ కార్మి కులకు రెండేళ్లుగా పీఎఫ్, జీఎస్‌టీ, ఈఎస్‌ఐ చెల్లించట్లేదు. సంబంధించిన వివరాలివ్వాలని జిల్లా ఉపాధి కల్పనా ధికారికి స.హ. చట్టం కింద దరఖాస్తు చేశాను. రెండేళ్లుగా తిరుగుతున్నా సమాచారం ఇవ్వకుండా దాట వేస్తున్నారు. సంబంధిత ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు సదరు అధికారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. – నోముల రాజేందర్‌గౌడ్, మందమర్రి, మంచిర్యాల జిల్లా
విచారణ జరిపి న్యాయం చేయండి..
సార్.. మేమంతా ఆదిలాబాద్‌లోని బెల్లూరి శివారు సర్వేనంబర్ 47/1/2, 47/1/3లో మదస్తు రమేశ్, మదస్తు ఆనంద్‌రావు, మదస్తు సత్యనారాయణల నుంచి ప్లాట్లను న్యాయబద్ధంగా కొనుగోలు చేశాం. వాటిలో ఇళ్లను నిర్మించుకుని జీవిస్తున్నాం. అయితే ఇటీవల రైల్వే అధికారులు ఆ స్థలమంతా తమదంటూ ఇటీవల మార్కింగ్ చేశారు. విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతున్నాం. – బాఽధితులు, ఆదిలాబాద్
‘ప్రజావాణి’కి వినతుల వెల్లువ అర్జీలు స్వీకరించిన కలెక్టర్
కై లాస్‌నగర్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అర్జీలు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వారు ఉన్నతాధికారులకు తమ సమస్యలను నివేదించారు. కలెక్టర్ రాజర్షి షా వారి నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని సంబంధిత అధికారులకు అందజేస్తూ సత్వరం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ వారం వివిధ శాఖలకు సంబంధించి 115 అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన వారి మాటల్లోనే...

సమస్యల నివేదన

సమస్యల నివేదన

సమస్యల నివేదన

సమస్యల నివేదన