
పోలీస్ గ్రీవెన్స్‌కు స్పందన
● 72 అర్జీలు స్వీకరించిన ఎస్పీ
ఆదిలాబాద్‌టౌన్: పోలీసు ప్రజాఫిర్యాదుల విభాగా నికి స్పందన లభిస్తుంది. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు జిల్లా నలుమూలల నుంచి 72 మంది త రలివచ్చి ఎస్పీకి తమ సమస్యలను విన్నవించారు. వాటిని ఓపికగా విన్న ఎస్పీ సత్వరం పరిష్కరించేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో సీసీరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి కవిత, వామన్ పాల్గొన్నారు.
నైపుణ్యాభివృద్దికి డ్యూటీ మీట్
నైపుణ్యాభివృద్ధికి డ్యూటీ మీట్‌లు దోహద పడతా యని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లాస్థాయి డ్యూటీ మీట్ సోమవారం ప్రారంభించి మాట్లాడారు. అధికారులు, సిబ్బంది పనితీరు మెరుగుపర్చేందుకు ఎంతగానో దోహద పడుతుందని తెలిపారు. వీటిని సద్వినియోగం చే సుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో ఉత్త మ ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయిలో రివార్డులు అందించనున్నట్లు వివరించారు. ఇందులో డీఎస్పీలు శ్రీనివాస్, జీవన్ రెడ్డి, సీహెచ్ నాగేందర్, ఇన్‌స్పెక్టర్లు ప్రణయ్ కుమార్, మొగిలి, వెంకటేశ్వర్‌రావు, వెంకటి, చంద్రశేఖర్, మురళి పాల్గొన్నారు.