
‘నేటి ధర్నా విజయవంతం చేయాలి’
ఇచ్చోడ: ఏఐటీయూసీ అనుబంధ, భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్ట నున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి కల్లెపెల్లి గంగయ్య కోరారు. ఆదివారం ఇ చ్చోడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల స మస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న ధర్నాకు జిల్లాలోని ప్రతీ మండలం నుంచి తాపీమేసీ్త్రలు, పెయింటర్లు, ప్లంబర్లు, లేబర్ కార్మికులు అధికసంఖ్యలో హాజరుకావాలని సూచించారు. సమావేశంలో నాయకులు బోఽ దస్ రవి, బొజ్జ రాజ్‌కుమార్, గొలుసుల విజ య్, రాయుడు, లక్ష్మణ్ పాల్గొన్నారు.