
● డీపీఆర్ రూపకల్పనకు టెండర్ల ఆహ్వానం ● రూ.కోటి విలువైన
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, వరద కాల్వల సమస్య కు శాశ్వత పరిష్కారానికి సంబంధించిన సమస్యల పై బల్దియా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రేడ్–1 స్థాయికి ఎదిగిన ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఈ సమస్యను దూరం చేసేలా చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ పథకమైన అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (యూఐడీఎఫ్) కింద రూ.600 కోట్ల వ్యయంతో పనులు చేపట్టాలని అంచనా వేసింది. క్షేత్రస్థాయిలో ఆయా పనులను చేపట్టేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)ను తయారు చేసేందుకు టెండర్లు ఆహ్వానించింది. ఆసక్తి గల ఏజెన్సీల నుంచి టెండర్లను స్వీకరించింది. అయితే ఇందుకు ఒకే ఒక టెండర్ దా ఖలు కావడం పలు అనుమానాలకు తా విస్తోంది. ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారా.. లేక అవగాహన రాహిత్యంతో ముందుకు రాలేదా.. అనే దానిపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డీపీఆర్‌కు సంబంధించిన టెండర్లను సోమవారం ఖరారు చేయనున్నారు.
భవిష్యత్‌లో సమస్యలు తలెత్తకుండా..
గ్రేడ్–1 స్థాయికి ఎదిగిన ఆదిలా బాద్ మున్సిపాలిటీ పరిధి రోజురో జుకూ విస్తరిస్తోంది. కొత్తగా పలు కాలనీలు వెలుస్తున్నాయి. దీంతో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, తాగునీటి సరఫరా ప్రాజెక్టులను, వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా వరద కాల్వలను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంకల్పించారు. ఆ దిశగా బల్దియా యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో ఆదిలాబాద్ పట్ట ణంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం, తాగునీటి రిజర్వాయర్ల నిర్మాణాలకు రూ.600 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రానికి ఎమ్మెల్యే ప్రతిపాదనలు పంపారు.
డీపీఆర్ సిద్ధమైతేనే నిధులు విడుదల..
ఆదిలాబాద్ పట్టణంలో చేపట్టాల్సిన రూ.600 కోట్ల పనులకు సంబంధించిన సిద్ధం చేసిన డీపీఆర్‌ను జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. అక్కడి నుంచి కేంద్రానికి నివేదించనున్నారు. కేంద్రం అందుకు ఆమోదం తెలిపితే ఆ నిధులు విడుదల కానున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేసేందుకు ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ జరుగుతుంది. అర్హులైన ఏజెన్సీల నుంచి దరఖాస్తులను స్వీకరించగా, ఒకే ఒక టెండర్ దాఖలైంది. దీన్ని ఈనెల 23న మధ్యాహ్నం 3 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో తెరవనున్నారు. ఒకే టెండర్ దాఖలు కావడంతో అదే ఏజెన్సీకి టెండర్ కట్టబెట్టే అవకాశం ఉంది. ఆ ఏజెన్సీ ఎవరనేది సీల్డ్ కవర్‌లో రావడంతో స్పష్టత లేదు. ఆ ఏజెన్సీ ఏదనేది సోమవారం తేలనుంది. సంబంధిత ఏజెన్సీ అందించే డీపీఆర్‌కు ఆమోదం లభిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బల్దియా భాగస్వామ్యంతో కూడిన అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ కోసం రూ.350 కోట్లు, వరద కాల్వలకు రూ.110 కోట్లు మంజూరు కానున్నాయి.
ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయం
డీపీఆర్ తయారీకి ఆదేశాలు..
ఎమ్మెల్యే ప్రతిపాదనలు పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన డీపీఆర్‌ను పంపించాల్సిందిగా మున్సిపల్ అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టిన బల్దియా అధికారులు ఇందుకు అర్హులైన ఆసక్తిగల ఏజెన్సీల నుంచి టెండర్లను ఆహ్వానిస్తూ ఈనెల 11న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 19 వరకు అర్హులైన ఏజెన్సీలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డీపీఆర్ తయారీకి అవసరమైన రూ.కోటి వ్యయాన్ని బల్దియా జనరల్ ఫండ్ నుంచి సంబంధిత ఏజెన్సీకి చెల్లించాలని నిర్ణయించారు. అయితే కోటి రూపాయల విలువైన డీపీఆర్ తయారీకి సంబంధించి ఒకే ఒక టెండర్ దాఖలు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
పారదర్శకంగా టెండర్లు
ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో రూ.600 కో ట్లతో చేపట్టే అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, తాగునీటి రిజర్వాయర్లు, వరద కాల్వల నిర్మాణా నికి సంబంధించిన డీపీఆర్ తయారీ కోసం టెండర్లు ఆహ్వానించాం. ఇందుకు ఈనెల 19 గడువు విధించగా ఒకేఒక టెండర్ దాఖలైంది. దానిని ఈనెల 23న ఖరారు చేస్తాం. ఈ వ్యవహారంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తాం.
– పేరి రాజు, బల్దియా ఇంజనీర్

● డీపీఆర్ రూపకల్పనకు టెండర్ల ఆహ్వానం ● రూ.కోటి విలువైన