
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
● ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్
తలమడుగు: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతీ కార్యకర్త సిద్ధంగా ఉండి సైనికుల్లా పని చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం తలమడుగు మండలం ఉండం గ్రామంలోని ఆయూష గార్డెన్‌లో వికసిత్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి వికసి త్ భారత్ నిర్మాణానికి అందరూ కట్టుబడి ఉండాల ని ప్రతిజ్ఞ చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలే గ్రామీణ ఎన్నికలకు బలమని, అందరూ కలిసికట్టుగా పనిచేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానందం, ఉపాధ్యక్షులు సామా సంతోష్‌రెడ్డి, పార్లమెంటు కోకన్వీనర్ మయూర్ చంద్ర, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాబారావు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రాజు, మండల కన్వీనర్ నారాయణరెడ్డి పాల్గొన్నారు.