
కానిస్టేబుల్‌ను కోల్పోవడం బాధాకరం
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: పోలీసు కానిస్టేబుల్‌ను కోల్పోవడం బాధాకరమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. టూటౌన్ పోలీసు స్టేషన్‌లో కోర్టు విధులు నిర్వహిస్తున్న పద్మవార్ ప్రకాష్ ఉట్నూర్ నుంచి ఆదిలాబాద్ టూటౌన్‌కు కోర్టు విధులకు వస్తున్న క్రమంలో ఆదివారం బస్సులో గుండెపోటుకు గురయ్యాడు. రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఉట్నూర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్న పార్థివదేహానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తక్షణ ఆర్థిక సహాయం కింద బాధిత కుటుంబ సభ్యులకు రూ.30 వేలు అందించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అంత్యక్రియల్లో టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు, ఎస్సై మొగిలి, సిబ్బంది పాల్గొన్నారు.