
మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు అన్నారు. ఆదివారం టూటౌన్ పోలీసుస్టేషన్ ఎదుట యాంటీ నా ర్కొటిక్ వారోత్సవాల సందర్భంగా సెల్ఫీ పా యింట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించడంతో ఆరోగ్యం దె బ్బతింటుందన్నారు. ఎక్కడైనా మత్తు పదా ర్థాలు విక్రయించినా, సేవించినా పోలీసులకు లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1908కు సమాచారం అందించాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలని సూచించారు.