
చదువుతోనే సమాజంలో గుర్తింపు
ఆదిలాబాద్‌రూరల్: చదువుతోనే సమాజంలో గుర్తింపు ఉంటుందని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్క ర్ భవన్‌లో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా బెస్ట్ అవైలబుల్ స్కీంలో 1, 5వ తరగతుల్లో ప్రవేశాల కోసం శుక్రవారం లక్కీడ్రా ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆమె హాజరై మాట్లాడారు. 1వ తరగతిలో 45 మంది, 5వ తరగతిలో 47 మంది విద్యార్థులను ఎంపిక చే సినట్లు తెలిపారు. జిల్లాలో ఎంపిక చేసిన ఏడు ప్రైవేట్ పాఠశాలల్లో వీరికి ప్రవేశం కల్పించి పదో తరగతి వరకు ఉచితంగా విద్య అందించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకొని ఉన్నతస్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇందులో డీఎస్‌సీడీవో సునీత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, డీసీవో లలిత, నారాయణ రెడ్డి, నర్సింగ్, పూర్ణచందర్, ఎస్సీ కుల సంఘాల నాయకులు కొప్పుల రమేశ్, నక్క రాందాస్, మల్యాల మనోజ్ తది తరులు పాల్గొన్నారు.