ఉచిత వృత్తివిద్య శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఉచిత వృత్తివిద్య శిక్షణ

Jun 20 2025 5:39 AM | Updated on Jun 20 2025 5:39 AM

ఉచిత వృత్తివిద్య శిక్షణ

ఉచిత వృత్తివిద్య శిక్షణ

ఇచ్చోడ: కేంద్ర ప్రభుత్వం ద్వారా నిరుద్యోగ యువతీయువకులకు వృత్తివిద్య శిక్షణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ఆదిలాబాద్‌ జనశిక్షణ సంస్థాన్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖ డైరెక్టర్‌ శ్యామల తెలిపారు. గురువారం ఇచ్చోడలో విలేకరులతో మాట్లాడారు. ఇచ్చోడ, బజార్‌హత్నూర్‌, సిరికొండ మండలాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. డ్రెస్‌మేకర్‌ (టైలరింగ్‌), బ్యూటీషియన్‌ కోర్సు, కంప్యూటర్‌ ఆపరేటర్‌, మగ్గం వర్క్‌, డ్రైవింగ్‌, హెల్త్‌కేర్‌, తేనెటీగల పరిశ్రమపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపా రు. ఆసక్తిగలవారు ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలతో ఇచ్చోడ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 9963098573, 9110732460 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్‌ శ్రీ 2025

న్యూస్‌రీల్‌

హాజరు శాతం పెంచాలి

బజార్‌హత్నూర్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచి తరగతులను పకడ్బందీగా నిర్వహించాలని డీఈ వో శ్రీనివాస్‌రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం మండలంలోని కాండ్లీ, గి ర్నూర్‌, పిప్రి, బజార్‌హత్నూర్‌ మండల పరి షత్‌ ప్రాథమిక పాఠశాలలు, జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలను ఆకస్మీకంగా తనిఖీ చేశారు. రికార్డులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. పిప్రి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఎల్‌ఈడీ టీవీ, కంప్యూటర్‌, టీషర్టులు అందించిన దాతలు విశాల్‌, భోజారెడ్డి, ప్రమోద్‌రెడ్డిని అభినందించారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో స్థానికులు ప్రభుత్వ పాఠశాలల ను ప్రోత్సహించాలని కోరారు. పాఠశాలల్లో ఉత్తమమైన విద్యను అందిస్తామని తెలిపా రు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాల ని సూచించారు. ఎంఈవో కిషన్‌గుప్తా, సీసీ రాజేశ్వర్‌, ప్రధానోపాధ్యాయులు కౌసల్య, భూమన్న, సురేందర్‌రెడ్డి, లక్ష్మి, ప్రేంకుమార్‌, సదానందం, ఉపాధ్యాయులున్నారు.

విజిట్‌లో వెల్లడైన అంశాలు

జిల్లా కేంద్రంలోని కేఆర్‌కే ఉర్దూ మీడియం పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు బో ధిస్తున్నారు. 430 మంది విద్యార్థులకు తొమ్మి ది మంది ఉపాధ్యాయులుండగా, ఇద్దరిని డి ప్యూటేషన్‌పై పంపించారు. ప్రస్తుతం ఏడుగు రు పనిచేస్తున్నారు. ఇందులో ఇద్దరు స్కూల్‌ అ సిస్టెంట్లు, ఐదుగురు ఎస్జీటీలున్నారు. 1, 2 తరగతుల విద్యార్థులను ఒకచోట, 3, 4 తరగతులు మరొక చోట, 6,7 తరగతుల విద్యార్థులను ఇంకో చోట కూర్చోబెట్టి బోధిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్‌, ఫిజికల్‌ సైన్స్‌, సోషల్‌, ఉర్దూ బోధించేవారు లేరు.

మావల మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలకు మన ఊరు–మనబడి కింద భవనం మంజూరైంది. నిధులు కూడా రావడంతో స్లాబ్‌ వేసి వదిలిపెట్టారు. దీంతో ఏడో తరగతి విద్యార్థులు ఆరుబయటే కూర్చోవాల్సిన పరిస్థితి. ఆరో తరగతి గది వర్షానికి ఉరుస్తోంది. దీంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. తరగతి గదిలో బోర్డు లేక పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బేల మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో తొమ్మిది తరగతులు నిర్వహిస్తున్నారు. 119 మంది విద్యార్థులుండగా ఒ కే ఉపాధ్యాయుడున్నారు. ఉర్దూ మీడియానికి బదులు తెలుగు, మరాఠీ మీడియం ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడంతో పాఠాలు అ ర్థం కావడం లేదని విద్యార్థులు చెబుతున్నారు.

తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలోగల ఉ న్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 310మంది విద్యార్థులుండగా ఇదివరకు ఉన్నవాటిని బాలికలు ఉపయోగిస్తున్నారు.

ఆదిలాబాద్‌ పట్టణంలోని కొమురంభీం కాలనీలోగల ప్రాథమిక పాఠశాలలో 81మంది వి ద్యార్థులున్నారు. ఒక రెగ్యులర్‌ ఉపాధ్యాయు డు ఉండగా, ఇద్దరినీ డిప్యూటేషన్‌పై పంపించా రు. బడి అద్దె భవనంలో కొనసాగుతోంది. వ రండా, మరో గదిలో తరగతులు బోధిస్తుండగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.

బజార్‌హత్నూర్‌ మండలం బలాన్‌పూర్‌లో గ్రా మంలో గల ప్రాథమిక పాఠశాల భవనం శిథి లావస్థలో ఉంది. వర్షం పడితే స్లాబ్‌ ఉరుస్తోంది. మరుగుదొడ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉ న్నాయి. పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థులుండగా, ఒక ఉపాధ్యాయుడున్నారు.

జైనథ్‌ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మన ఊరు–మనబడి కింద రూ.80 లక్షలతో చేపట్టిన భవన నిర్మాణం పూర్తి కాలేదు. బిల్లులు రాకపోవడంతో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో తరగతి గదులు సరిపడా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

సిరికొండ మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలోగల ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా కనిపించాయి. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఈ పాఠశాలలో 16 మంది విద్యార్థులు చదువుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement