
ఉట్నూర్‌లో ‘మై టాక్సీ ఈజ్ సేఫ్’
ఉట్నూర్‌రూరల్: ఉట్నూర్ సబ్ డివిజన్ కార్యాల యం ఎదుట, ఉట్నూర్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ అ ఖిల్ మహాజన్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్‌తో క లిసి ‘అభయ మై టాక్సీ ఈజ్ సేఫ్’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎ స్పీ మాట్లాడుతూ.. విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో యువతులు, మహిళా ప్రయాణికుల భద్రత చర్యల్లో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 3,232 ఆటోల్లో ‘అభయ మై టాక్సీ ఈజ్ సేఫ్’ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. ఇందులో ఉట్నూర్ సబ్ డివిజన్‌లో 850 ఆటోల రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు తెలిపారు. ఆటోల్లో ముందు, వెనుక భాగంలో క్యూఆర్ కోడ్, జిల్లా ప్రత్యేక నంబర్ కలిగి న పోస్టర్ అతికించి, లోపలి భాగంలో ఆటో డ్రైవర్ వివరాలు, క్యూఆర్ కోడ్, ఆటో రిజిస్ట్రేషన్ నంబర్ కనబడేలా పోస్టర్లను శాశ్వతంగా అతికిస్తున్నట్లు పే ర్కొన్నారు. ప్రయాణికులు ఎక్కిన వెంటనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ఒక వెబ్ అప్లికేషన్ వస్తుందని తెలిపారు. అందులో మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత వారికి మూడు భద్రత ఆప్షన్లు ‘ట్రాక్ మై లొకేషన్, ఎమర్జెన్సీ కాల్, కంప్లయింట్’ కనబడతాయని పేర్కొన్నారు. మహిళలు అత్యసర సమయంలో దీనిని ఉపయోగించుకోవాలని సూచించా రు. ఉత్తమ రేటింగ్ కలిగిన ఆటో డ్రైవర్లు, యజమానులకు అవార్డులు అందించి ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. నేరాల నియంత్రణ, నేరాల అదుపునకు ప్రతి ఒక్కరూ ‘అభయ మై టాక్సీ ఈజ్ సేఫ్’ కార్యక్రమంలో పాల్గొనాలని ఎస్పీ పిలుపునిచ్చారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. స్వయంగా ఆటోల వద్దకు వెళ్లి పోస్టర్ అతికించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఐ మొగిలి, ఎస్సై మనోహర్ తదితరులున్నారు.