
పెన్షన్ల పంపిణీలో అక్రమాలకు తావివ్వొద్దు
● కలెక్టర్ రాజర్షి షా ● ‘చేయూత’ అమలుపై వర్క్‌షాప్
కై లాస్‌నగర్: పెన్షన్ల పంపిణీలో అక్రమాలకు తావులేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. చేయూత పథకం (సామాజిక భద్రత పెన్షన్లు) అమలుపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–సెర్ప్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ బిల్ కలెక్టర్లకు పట్టణంలోని ఎస్టీయూ భవన్‌లో గురువారం వర్క్‌షాపు నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ హాజరై దిశానిర్దేశం చేశారు. అనర్హులను ఏరివేయడంతో పాటు మరణించిన వారి పేర్లు జా బితాల నుంచి తొలగించాలని ఆదేశించారు. లబ్ధి దారులకు సకాలంలో పెన్షన్లు అందించేలా శ్రద్ధ వ హించాలని పేర్కొన్నారు. పెన్షన్‌కు అర్హులై సదరం సర్టిఫికెట్ లేనివారు యూడీఐడీ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పంచాయతీ అ డ్వాన్స్‌మెంట్ ఇండెక్స్ సమాచారాన్ని సమగ్రంగా నమోదు చేయాలని తెలిపారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్‌లో అవార్డులు పొందే దిశగా కార్యదర్శులు, ఎంపీడీవో లు కృషి చేయాలని సూచించారు. పెన్షన్ల పంపిణీలో మార్పులు, దరఖాస్తుల స్వీకరణ, పెన్షన్ల పంపిణీకి చేపట్టాల్సిన చర్యలపై సెర్ప్ డైరెక్టర్ గోపాల్‌రా వు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శిక్షణ ఇ చ్చారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. పెన్షన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలను పూర్తిగా ని యంత్రించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కేంద్రంలోనే పెన్షన్లను అందించాలని సూచించారు. జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీపీవో రమేశ్, ఏపీవో జాదవ్ శేష్‌రావు, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, డీఎల్‌పీవోలు పాల్గొన్నారు.