
పంచాయతీ ఎన్నికల సామగ్రి తరలింపు
కైలాస్‌నగర్: స్థానిక సంస్థల సమరానికి ఎన్నికల సంఘం ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదల చేయవచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జిల్లా అధి కార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జి ల్లా పంచాయతీ అఽధికారులు తాజాగా ఎన్నికల సా మగ్రి తరలింపుపై దృష్టి సారించారు. రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారుల కరదీపికలు, బ్యాలెట్ పేప ర్లు, పోలింగ్‌కు ముందు, తర్వాత పీవో చేసే ప్రకట నలు ఉంచే కవరు, మార్క్‌డ్ ఓటర్ల జాబితా లాంటి సామగ్రి నెల కిందటే జిల్లాకు చేరింది. ఈ సామగ్రి ని జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోని పంచా యతీ వనరుల కేంద్రంలో భద్రపర్చారు. ఎన్నికలు నిర్వహించనున్నట్లు వస్తున్న సంకేతాల నేపథ్యంలో సామగ్రిని మండలాల వారీగా వాహనాల్లో తరలి స్తున్నారు. ఇప్పటివరకు బజార్‌హత్నూర్, సొనాల, నేరడిగొండ తదితర తొమ్మిది మండలాలకు సామ గ్రి పంపిణీ పూర్తి చేశారు. మరో 11 మండలాలు మిగిలి ఉండగా రెండు, మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో అందజేస్తామని డివిజనల్ పంచాయతీ అధి కారి ఫణీందర్‌రావు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక పోలింగ్‌కు ఒక్కరోజు ముందుగా ఈ సామగ్రిని మండల కేంద్రంలోని రిసెప్షన్ కేంద్రంలో ఎన్నికల సిబ్బందికి అందజేస్తామన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎన్నికలు నిర్వహించేలా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.